భద్రాచలం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

61చూసినవారు
భద్రాచలం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ఈ నెల 7 న భద్రాచలంలో జరిగిన కణితి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గుంజ సాయిరాంను అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. నేరస్తుల కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతూ ఉండగా ప్రధాన నిందితుడు గుంజ సాయిరామ్ ను సోమవారం భద్రాచలం పోలీస్ సిబ్బంది పట్టుకోవడం జరిగిందని, పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి భద్రాచలం ప్రథమ శ్రేణిమేజిస్ట్రేట్, భద్రాచలం ముందు హాజరు పరుస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్