భద్రాచలంలో చిన్న పాటి వర్షానికి స్వాతి టిఫిన్ సెంటర్ వద్ద చెరువును తలపించేలా వర్షపు నీరు నిలిచింది. శుక్రవారం స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. ఎప్పుడు వర్షం వచ్చినా సరైన డ్రైనేజీ లేక చెరువులు తలపించేలా వర్షపునీరు రోడ్లపై నిలుస్తుందన్నారు. వాహనదారులు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు వెల్లడించారు.