భద్రాచలం: విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

4చూసినవారు
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ బిల్లులను విడుదల చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. రాష్ట్రంలో గత ఆరేళ్ల నుంచి రూ. 8, 158 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్