గోదావరిలోకి భారీగా నీరు చేరుతుండగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆదివారం బూర్గంపాడు ఆసుపత్రిలో వైరల్ ఫీవర్‌తో ప్రజలు అధికంగా చేరారు. దోమలతో విష జ్వరాలు వ్యాపిస్తాయని, దోమ తెరలు వాడకం ద్వారా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా నీటిని కాచి వడపోసి తాగాలని, పిల్లల విషయంలో వేడి పదార్థాలను మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు.