రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూ భారతి చట్టాన్ని అమలుపరుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ లో జరిగిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో ఎన్నో అవకతవకలు జరిగాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. ఎందరో రైతులు ఇబ్బందులు పాలయ్యారని, ధరణిని వినియోగించుకుని అనేక మంది అమాయకుల భూములు కబ్జాలకు గురయాయని అన్నారు.