పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపహాడ్ మండలం సారపాక సుందరయ్య నగర్ కాలనీలో ప్రీమియర్ లీగ్ -2025 క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ప్రారంభించారు. క్రీడలు యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని, ఆరోగ్య కరమైన క్రీడలు యువతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ భారీగా నిధులు మంజూరు చేసి యువతను ప్రోత్సహిస్తున్నారన్నారు.