బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, బూర్గంపాడు పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 29వేల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.