దుమ్ముగూడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని వెంటనే రీసర్వే నిర్వహించి అసలైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సుబ్బారావు పేట గ్రామపంచాయతీ ప్రజలు సోమవారం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. మొదటి విడత ఎంపిక చేసిన వారిలో చాలామందికి ఇళ్లు ఉన్నాయని, అర్హులకు కేటాయించాల్సిన ఇందిరమ్మ ఇళ్లు, అనర్హులకు కేటాయించారని వినతి పత్రంలో పేర్కొన్నారు.