పేద విద్యార్థినికి ఆర్థిక సాయం

85చూసినవారు
పేద విద్యార్థినికి ఆర్థిక సాయం
బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో బీటెక్ చదువుతున్న పేద విద్యార్థిని ఎడమకంటి యామిని ఉన్నత చదువుల కోసం మోరంపల్లిబంజరు గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ రూ. 8 వేలు ఆర్థిక సాయంగా అందించారు. ఈ నగదును ఎంపీడీవో జమలారెడ్డి చేతులమీదుగా ఆ విద్యార్థినికి గురువారం అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చేయూత ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్