తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలా రెడ్డి పేర్కొన్నారు. బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన దివ్యాంగుల బస్సు పాస్ మేళా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బస్సు విలేజ్ ఆఫీసర్లు సీహెచ్. రమేష్, బీఆర్కే. రెడ్డి, పాత్రికేయులు తోకల మోహన్ రావు పాల్గొన్నారు.