అశ్వాపురంలో ఆదివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మండల వాసులు వర్షంతో ఉపశమనం లభించింది. చల్లటి వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించారు. పరిసర గ్రామాల రైతులు తమ పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటల రైతులు ఇబ్బందులు పడ్డారు.