మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం స్వాతంత్ర్యం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.