మణుగూరు ఏరియా పీవీ కాలనీలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు, యువతీయువకులకు టైలరింగ్, బ్యూటీషియన్, స్పోకెన్ ఇంగ్లిష్, మగ్గం వర్క్స్్స్ప ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా జీఎం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తి చేసి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 20వ తేదీలోపు ఏరియా జీఎం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.