మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన కారం సీతారాములు 40 సంవత్సరాలు ప్రమాదవశాత్తు కరెంటు పోలు పైనుంచి పడి తీవ్ర గాయాలయ్యి మంచానికి పరిమితమై ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో వైద్య ఖర్చులకి ఇబ్బంది పడుతున్నారు. స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ రూ.15 వేలు నగదు, 50 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు సహాయం గా అందించారు.