మణుగూరు: బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలి

56చూసినవారు
మణుగూరు: బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలి
బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఐక్యంగా పోరాడాలని అందుకు బీఎస్పీని ఎంచుకోవాలని జిల్లా ఇన్చార్జ్ తడికల శివకుమార్ అన్నారు. మణుగూరు పట్టణంలో నియోజకవర్గ అధ్యక్షుడు సత్యవరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. వేల సంవత్సరాలు చదువుకు, సంపదకు, సామాజిక గౌరవానికి దూరంగా ఉన్న బహుజన జాతులన్నీ ఐక్యంగా పోరాడి రాజ్యాధికారాన్ని సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్