మణుగూరు ఎస్ఎంఎస్ ప్లాంట్ కాంట్రాక్టర్ కార్మికుల వేతన ఒప్పంద చర్చలు వెంటనే జరపాలని, వేతన ఒప్పంద అగ్రిమెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దెల శ్రీనివాసరావు శనివారం డిమాండ్ చేశారు. మణుగూరు ఎస్ఎంఎస్ ప్లాంట్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రెండేళ్లుగా కార్మికుల వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని ఆరోపించారు.