
కెన్యాలో SSMB29 కీలక సన్నివేశాలు?
రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న SSMB29(వర్కింగ్ టైటిల్) ఇటీవలే ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ జులైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. పార్క్ లోకేషన్స్ మూవీకి గ్రాండ్ లుక్ను తీసుకురానున్నాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. 2026 చివరి నాటికి షూటింగ్ పూర్తవతుందని అంచనా.