మణుగూరు: ఇసుక క్వారీలో అక్రమ దందా!

51చూసినవారు
మణుగూరు మండలం పద్మగూడెం ఇసుక క్వారీలో అక్రమ దందా నడుస్తోందని స్థానికులు చెప్పారు. సొసైటీ నిబంధనలు అతిక్రమించి ప్రోక్లెన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. TGMDC సిబ్బంది సమక్షంలో క్వారీలో నేరుగా లారీలలో లోడింగ్ చేస్తున్నారని తెలిపారు. లోడింగ్ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లు చేస్తున్నారని వాపోయారు. ప్రశ్నించిన లారీ డ్రైవర్లపై దాడులు చేయిస్తున్నారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్