మణుగూరు: బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయంకి ఆహ్వానం

56చూసినవారు
మణుగూరు: బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయంకి ఆహ్వానం
మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సమితి సింగారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీశ్రీశ్రీ సంకల్ప కార్యసిద్ధి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్