మణుగూరు ప్రధాన రహదారి సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఉన్న డివైడర్స్ మధ్య ఖాళీ స్థలంలో వాహనదారులు వాహనాలు నిలపకూడదని సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ మేడా ప్రసాద్ శనివారం సూచించారు. తమ వాహనాలను ఇష్టానుసారంగా నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ప్రజలకు సహకరించాలని సూచించారు.