మణుగూరు మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో పల్నాటి వెంకటేశ్వరరావు బుధవారం తనిఖీ చేశారు. విద్యా విధానం, వసతులు, పరిశుభ్రత, విద్యార్థులకు అందే భోజనం, మంచినీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నూతన డైట్ మెనూ ప్రకారం భోజనం అందుతున్న విధానాన్ని కూడా సమీక్షించారు.