గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో చైనా మాంజా వాడితే చర్యలుంటాయని మణుగూరు ఎస్ఐ ప్రసాద్ గురువారం హెచ్చరించారు. ప్రమాదకర మాంజా అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు. ఈ మాంజా పక్షుల ప్రాణాలకే కాకుండా రోడ్డుకు అడ్డంగా వేళాడుతూ వాహనదారుల గొంతుకు చుట్టుకొని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.