కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మణుగూరు మండల BRS యువజన విభాగం అధ్యక్షుడు భోశెట్టి రవిప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్ టాప్ లు అందజేయాలని, పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉత్తీర్ణత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.