మణుగూరు: ఇసుక లారీ నిలిపేసిన రాజుపేట వాసులు

67చూసినవారు
మణుగూరు: ఇసుక లారీ నిలిపేసిన రాజుపేట వాసులు
మణుగూరు నుంచి రాజుపేట మీదుగా రాత్రివేళ వెళుతున్న ఇసుక లారీలను గురువారం రాత్రి గ్రామస్థులు నిలిపివేశారు. లారీల వల్ల దుమ్ము, ధూళితో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం చూడాలని డిమాండ్ చేశారు. సమీప ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించి లారీలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్