మణుగూరు: పెండింగ్ లో ఉన్న భూములకు పట్టాలు ఇప్పించాలని వినతి

54చూసినవారు
మణుగూరు: పెండింగ్ లో ఉన్న భూములకు పట్టాలు ఇప్పించాలని వినతి
మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన రైతులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. గత 50 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, ఆ భూములకు ఐటిడిఏ పట్టాలు జారీ చేసిందని అన్నారు. కానీ అందులో కొంతమందికి అర్హత కలిగిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారని.. వారికి పట్టాలు ఇప్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్