తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు సముచిత గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకుడు రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం మణుగూరులో సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. ముదిరాజుల రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.