మణుగూరు డివిజన్ సింగరేణి కాలరీస్ కంపెనీలో శుక్రవారం రైల్వే లైన్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించారు. షార్ట్ పే పద్ధతిని రద్దు చేయాలని, అదేవిధంగా ప్రతి నెల జీతాలు ఏడో తారీఖున ఇప్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని కార్మికులు కోరారు. అటు పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ సాంబ పేర్కొన్నారు.