మణుగూరులో రంజాన్ ను ముస్లింలు సంతోషంగా జరుపుకున్నారు. గురువారం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రార్థనలు చేశారు. శేషగిరినగర్, సుందరయ్యనగర్, అశోక్ నగర్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని ముస్లింల ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.