బూర్గంపాడు మండలం గాంధీనగర్ అంగన్వాడీ 3 సెంటర్ లో గురువారం అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్ రచన ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్‌వాడీ బడిలో చేరాలని వారికి స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.