బూర్గంపాడు మండలం రాజీవ్ నగర్ అంగన్వాడీ సెంటర్ లో గురువారం అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్ విజయ ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్‌వాడీ బడిలో చేరాలని వారికి స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించామని, కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ కావాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.