పినపాక: రోడ్డు ప్రమాదంలో భక్తులకు గాయాలు

84చూసినవారు
పినపాక: రోడ్డు ప్రమాదంలో భక్తులకు గాయాలు
భద్రాచలం గుడిలో మాల విరమణకు వేములవాడకు చెందిన ఆంజనేయ స్వామి మాలధారులు ఆదివారం వచ్చారు. మాల విరమణ చేసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో పినపాక మండలం గొట్టెల్లా ప్రధాన రహదారి వద్ద వారి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని మణుగూరు ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్