పినపాక మండలంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నా, వాటిని అరికట్టడంతో అధికార యంత్రాంగం విఫలమవుతోందని పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆరోపించారు. శనివారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో గల కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బంకుల్లో తనిఖీలు నామ మంత్రంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.