భద్రాచలం రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలను వలిచే కార్యక్రమం పూర్తయిందని కనకదుర్గమ్మ ఆలయం అర్చకులు అంబటిపూడి ప్రసాద్ శర్మ తెలిపారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం గ్రామం కనకదుర్గ ఆలయం, శ్రీ సాయిబాబా ఆలయం నుండి గోటి తలంబ్రాలతో భద్రాచలం వరకు పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య చెంతకు వెళుతున్నట్లుగా భక్తులు తెలియజేశారు.