పినపాక మండలం బోటిగూడెం పంచాయతీలో గురువారం భూభారతి గ్రామ రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. భూసమస్యలు ఉన్న రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని అమలు పరుస్తుందని, ధరణి పోర్టల్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని, రైతులు చాలా నష్టపోయారని, భూభారతితో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.