ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అంతర్గత రహదారులు నిర్మించి అభివృద్ధికి పాటుపడిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి, ఐలాపురం గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఆర్వో గోపాలకృష్ణ, MPDO సునీల్ శర్మ ఉన్నారు.