ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు.