రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల, రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మణుగూరు తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని మండిపడ్డారు.