రోడ్లు, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి

54చూసినవారు
రోడ్లు, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి
రోడ్లు, సాగునీరు, నీళ్లు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, బుధవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. జిల్లా నాయకులు సత్యం మాట్లాడారు. పినపాక నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలన్నారు. అలాగే పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అటు ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్