బూర్గంపాడు మండలం సారపాకలో గల బ్రిలియంట్ కాలనీలో ఉన్నటువంటి బ్రిలియంట్ విద్యాసంస్థలలో సంక్రాంతి సందర్భంగా వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పాఠశాల హెడ్మిసెస్ స్వర్ణ కుమారి మొదటిగా నర్సరీ ఎల్.కె.జీ విద్యార్థులకు భోగి పళ్ళు పోశారు. అనంతరం జరిగిన రంగోలి పోటీలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు, సంక్రాంతి పండగ ఉట్టిపడే విధంగా వేసిన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి.