బూర్గంపాడు మండలం సారపాక విద్యుత్ ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఏఈ ఉపేందర్ కు ఉత్తమ సేవా అవార్డు లభించింది.
78వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా గురువారం వరంగల్ లో గల టీజీ ఎన్పీడిసియల్ కార్యాలయంలో అవార్డు అందుకున్నారు. గోదావరి వరదల సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను టిజి ఎన్పీడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమసేవ పురస్కారం అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ఏఈకి పలువురు అభినందనలు తెలిపారు.