జూలూరుపాడులో క్రైస్తవులు మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫాస్ట్ రేట్ క్రీస్తు సంఘ సభ్యులు స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు ఎరూషలేం ప్రాంతానికి వచ్చి గొప్ప అద్భుతాలను సృష్టించగా ఆయనను వెంబడించిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటారని రెవరెండ్ చిలుకూరి సామెల్ అన్నారు. ఈ ఊరేగింపులో సెక్రటరీ కాంతారావు, రాంబాబు, దేవ సహాయం, అబ్రహం, ప్రభాకర్ పాల్గొన్నారు.