భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఏజెన్సీ నిబంధనలు అతిక్రమించి ఇష్టా రీతిన డబ్బులు దండుకున్న తహశీల్దార్ పై కొంతమంది కలెక్టర్ పాటిల్ కి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ ను విధుల నుండి తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కోలేటి భవాని శంకర్ కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.