ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది

59చూసినవారు
ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది
రైతుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వరుస రైతు ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయన్నారు. ప్రొద్దుటూరులో పురుగుమందు తాగి ఒక రైతు, భద్రాద్రి జిల్లా జానికిపురంలో మరొక రైతు ప్రాణాలను విడిచారని, రఘునాథపాలెం మండలాల రైతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని భారాస అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్