దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో గురువారం ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. గ్రేహౌండ్స్ బలగాలకు, లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందారు.ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయినా కానిస్టేబుల్ ని మణుగూరు ఆసుపత్రి తరలించారు.