గార్ల నుంచి రాంపురం, మద్దివంచ వెళ్లే దారిలో ఉన్న పాకాల చెక్ డ్యాం వద్ద హై లెవెల్ వంతెనను నిర్మించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం పాకాల చెక్ డ్యామ్ సమీపంలో రాస్తారోకో చేశారు. గార్ల మండల కార్యదర్శి జంపాల వెంకన్న పోతుల నరసింహారావు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులున్నారు అనంతరం జిల్లా కలెక్టర్కు నాయకులు వినతి పత్రం సమర్పించారు.