భద్రాచలం: నిజాయితీ చాటుకున్న స్వీపర్

74చూసినవారు
భద్రాచలం: నిజాయితీ చాటుకున్న స్వీపర్
భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ లో బస్టాండ్ శుభ్రం చేస్తున్న స్వీపర్ లక్ష్మి నిజాయితీ చాటుకుంది. బస్టాండ్ లో ఓ వ్యక్తి రూ. 10 వేలు కలిగిన పర్సును పోగొట్టుకోగా అది స్వీపర్ లక్ష్మికి దొరికింది. ఆ పర్సును స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావుకు స్వీపర్ ఇచ్చింది. ఆ పర్సు చూడగా నగదు ఉండటంతో పర్సులో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఆధారంగా ఫోన్ చేయగా గుంటూరుకు చెందిన పాలడుగు శివదిగా గుర్తించారు. అతనికి విషయం చెప్పగా పర్సు పోగొట్టుకున్న శివ ఆర్టీసీ బస్టాండ్కు రావడంతో అతనికి స్వీపర్ లక్ష్మి చేతులమీదుగా ఆ పర్సును అందించారు.

సంబంధిత పోస్ట్