ఇల్లందు కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని వారి తండ్రి ఇటీవల వరదల్లో కొట్టుకుపోయి మరణించిన విషయం తెలిసిందే. శుక్రవారం గంగారాంతండాలో అశ్విని కుటుంబాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ పరామర్శించారు. అనంతరం అశ్విని చిత్రపటానికి వారు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.