పురపాలక సంఘం ఇల్లందు కార్యాలయం నందు శరత్ మాక్సివిజన్ ఐ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు కౌన్సిలర్లు ఆఫీస్ సిబ్బంది వైద్య సిబ్బందిని ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మేనేజర్ అంకు షావలి, ఏ ఈ కుమార్ స్వామి, ఆర్ ఐ శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులున్నారు.