ఇల్లెందు మండలం చెన్నంగలగడ్డకు చెందిన యువ రైతు ఆలె రవి(29) చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. తన అరెకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని పత్తి వేయగా. ఇటీవల వర్షాలకు దెబ్బతింది. మనస్తాపంతో మంగళవారం పురుగు మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. తల్లి సమ్మక్క ఇచ్చిన ఫిర్యాదుతో హెడ్కానిస్టేబుల్ తులసీరాం కేసు నమోదు చేశారు.