లేక్ పార్కులో ఘనంగా ఉగాది వేడుకలు

78చూసినవారు
లేక్ పార్కులో ఘనంగా ఉగాది వేడుకలు
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట ఏరియాలో గల చిల్డ్రన్ లేక్ పార్క్ లో ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. పండుగ వేడుకలు పంచాంగ శ్రవణంతో ప్రారంభమయ్యాయి భక్తులకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. తెలుగు ప్రజల సాంప్రదాయ ఆచారాలను ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్